భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 102 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెప్టెంబర్ 1, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 13, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
కెమికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 31
సివిల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 8
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ ఖాళీలు: 9
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖాళీలు: 5
సేఫ్టీ ఇంజనీరింగ్/సేఫ్టీ & ఫైర్ ఇంజనీరింగ్ ఖాళీలు: 10
మెకానికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 28
మెటలర్జీ ఇంజనీరింగ్ ఖాళీలు: 2
ఇతర ఖాళీలు: 9