శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

0
115

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ 300 ప్రత్యేక దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటా ఆగస్టు 18 ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. తితిదే వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచనుంది.

అలాగే వార్షిక బ్రహ్మోత్సవాల జరిగే సమయంలో 300 ప్రత్యేక దర్శనం ఉండదని స్పష్టం చేసింది. కేవలం సర్వ దర్శనం మాత్రమే ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాలని టిటిడి ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు, సెప్టెంబర్ 27 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్‌ 27న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.