శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆఫ్ లైన్ లో దర్శన టికెట్లు

Good news for Srivari devotees..Darshan tickets offline

0
81

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ లో దర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి పాలక మండలి. తిరుపతిలో రోజుకి 15 వేల చోప్పున టోకేన్లు జారీ చేయాని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15, 16వ తేదిన అనేక కార్యక్రమాలకు ముహుర్తం పెట్టింది టిటిడి.

ఈ టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం,గోవిందరాజ సత్రాలలో జారీ చేయనుంది. రెండేళ్ల అనంతరం మొట్టమొదటి సారి అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది టీటీడీ. అలాగే ఈ నెల 16 వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఆకాశగంగ వద్ద హనుమంతుడి ఆలయ అభివృద్ది పనులుకు భూమి పూజ నిర్వహించనుంది టీటీడీ.

అంతేకాదు హనుమంతుడు జన్మస్థలం తిరుమలగా పేర్కొనే.. ఆధారాలతో కూడీన పుస్తకాలను అదే రోజున విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది టిటిడి పాలక మండలి.16వ తేదిన తరిగోండ వెంగమాంబ బృందావనం అభివృద్ది పనులుకు శ్రీకారం చుట్టడంతో పాటు.. ఉదయాస్తమాన సేవా యాప్ ను విడుదల చేయనుంది.