రెండో రోజు ఐపీఎల్ వేలం..ఫ్రొంఛైజీల వ‌ద్ద డ‌బ్బు ఎంతంటే?

IPL auction on the second day .. How much money is there for the franchisees?

0
37

ఐపీఎల్ తొలి రోజు వేలం పూర్తైంది. కాగ తొలి రోజు ఫ్రొంఛైజీలు ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం కురిపించాయి. తొలి రోజు లక్నో సూప‌ర్ జాయింట్స్ ఏకంగా రూ. 52.10 కోట్లు వెచ్చించి.. 11 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. దీంతో ఇంకా ప‌ర్స్ లో కేవ‌లం రూ. 6.90 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఇప్పటివరకు ఇషాన్ కిషన్ (15.50 కోట్లు) అత్యధిక ధర పలికాడు.

ఢిల్లీ రూ. 31 కోట్ల‌తో 13 మందిని ద‌క్కించుకుంది. ఇంకా రూ. 16.50 కోట్లు ఉన్నాయి. చెన్నై రూ. 27.55 కోట్ల‌తో 10 మందిని తీసుకుంది. ఇంకా రూ. 20.45 కోట్లు ఉన్నాయి. ముంబై అత్య‌ల్పంగా కేవలం రూ. 20.15 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది. 8 మందిని కొనుగోలు చేసింది. ఇంకా రూ. 27.85 కోట్లు ఉన్నాయి. కాగ తొలి రోజు యంగ్ ప్లేయ‌ర్ల వైపే చూసిన ఫ్రొంఛైజీలు.. ఈ రోజు సీనియ‌ర్, విదేశీ ఆట‌గాళ్లపై కాసుల వ‌ర్షం కురిపించ‌నున్నాయి. ఈ రోజు కూడా మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఈ మెగా వేలం ప్రారంభం కానుంది.

ఈ వేలంలో బౌలర్లు మంచి ధర పలికారు. టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అతడిని రూ.14 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.కనీస ధర రూ.2 కోట్లు ఉన్న శార్దూల్‌ ఠాకూర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.గత సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్షల్‌ పటేల్‌, శ్రీలంక స్పిన్నర్‌ వానిందు హసరంగలకు చెరో రూ.10.75 కోట్లు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. అలానే అవేశ్‌ ఖాన్‌ రూ. 20 లక్షల కనీస ధరతో ప్రారంభమై రూ. 10 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.న్యూజిలాండ్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ని గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా.. రూ.10 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.