తెలంగాణ విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. బీసీ సంక్షేమ శాఖ, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం క్రింద బీసీ మరియు ఈబీసీ విద్యార్థుల నుండి దరఖాస్తు కోరుకుంది. ఈ విద్యా సంవత్సరానికి (2022) ఆగస్టు/సెప్టెంబర్ సెషన్ కు సంబంధించి అభ్యర్థులు నమోదు చేసుకొనుటకు తేదీ 01.09.2022 న ప్రారంభమై రిజిస్ట్రేషన్ల చివరి తేదీ 30.09.2022 న ముగుస్తుందని వారు తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ముందుగా https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం Overseas Scholarship Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi for BC and EBC students విభాగంలో Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. కావాల్సిన వివరాలను నమోదు చేసి..సూచించిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలి
ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ను జాగ్రత్తగా ఉంచాలి. అలాగే శారీరక వైకల్యం, కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయిన విద్యార్థుల విషయంలో, ఫ్యాక్ట్ చెకింగ్ తర్వాత అభ్యర్థుల లిస్టును తయారు చేయనున్నారు. కొత్త సివిల్స్ బ్యాచ్‌ను సెప్టెంబర్ 5, 19 తేదీల్లో ప్రారంభించనునట్లు తెలిపింది.
స్కాలర్‌షిప్ సదుపాయంతో పాటు, కోచింగ్ ఖర్చును భరించలేని యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఈఎంఐ ఆప్షన్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. అభ్యర్థులు విడతల వారీగా ఫీజు చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది. ఈఎంఐ అవకాశం 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఈ ఏడాది నుంచి స్కాలర్‌షిప్‌ను ప్రారంభించనుంది. ఈ స్కాలర్‌షిప్స్ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని ఆ సంస్థ అధికారులు ఆకాంక్షిస్తున్నారు.