రైతులకు శుభవార్త..ఈనెల 31న ఖాతాల్లో ఆ డబ్బు జమ

0
94

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.6 వేలచొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ కొంతమేరకు ఆదుకుంటుంది. అయితే ఈ రైతుబంధు తీసుకునే రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రారంభించి రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు 11వ విడత కింద రైతుల ఖాతాలో నగదు జమ చేయనుంది. రూ.21,000 కోట్లకు పైగా నిధులను మే 31వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారిక ప్రకటన జారీ అయింది. చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు జమ చేస్తోంది.