ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వంట గ్యాస్ ని ఫ్రీగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద పొందవచ్చు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటివరకు 9 కోట్ల మంది ప్రజలు ఉచిత LPG కనెక్షన్‌లను తీసుకున్నారు. అయితే మీరు కూడా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ ని పొందాలని అనుకుంటున్నారా..?
అయితే కొత్తగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.3,200 ఖర్చు అవుతుంది. అయితే మీరు ఉజ్వల స్కీమ్ కింద ఎల్‌పీజీ కనెక్షన్ పొందితే రూ.1600 సబ్సిడీ వస్తుంది. కేంద్రం ఈ డబ్బులు చెల్లిస్తుంది. ఇక మిగిలిన రూ.1600 ఆయిల్ కంపెనీలు అందిస్తాయి. 18 సంవత్సరాల దాటి ఉన్న మహిళలు అప్లై చేసుకోవచ్చు.
దీని కోసం ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
నెక్స్ట్ అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకు ఇండేన్, భారత్ పెట్రోలియం, HP గ్యాస్ కంపెనీలు కనపడతాయి.
ఇందులో నుండి ఒకటి ఎంచుకోండి.
ఇప్పుడు వివరాలను ఫిల్ చెయ్యండి.
డాక్యుమెంట్లు ధృవీకరించిన తర్వాత మీ పేరుపై LPG గ్యాస్ కనెక్షన్ జారీ చేస్తారు.
నెక్స్ట్ స్టేజి లో LPG కనెక్షన్‌తో పాటు ఉచితంగా మొదటి సిలిండర్‌ను రీఫిల్ చేసి ఇస్తారు.
ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు.