ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు.
- విభాగాలు: సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
- అర్హత: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్, ఎల్‌సీఈ/తత్సమాన ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు.
- వయసు: అభ్యర్థుల వయసు 2021, జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- వేతనం: రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970 వేతనం లభిస్తుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 21, 2021
- దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 11, 2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://psc.ap.gov.in/