బ్రేకింగ్: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..1433 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

0
98

తెలంగాణాలో కొలువుల జాతర షురూ అయింది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్, పోలీస్ నియామకాలలో ఉద్యోగాలను  భర్తీ చేసి నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పించారు. తాజాగా తెలంగాణ సర్కార్ మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖల్లో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరోసారి నిరుద్యోగులను ఖుషి చేసారు.

మున్సిపాలిటీ అలాగే పంచాయతీరాజ్ శాఖ లో హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి అనుమతించింది. 420 చీఫ్ ఇంజనీరింగ్ అంటే రూరల్ వాటర్ సప్లై పోస్టులు, 350 ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అంటే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పోస్టులు, 196 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అలాగే 236 పబ్లిక్ హెల్త్ మరియు ఇతర పోస్టులు ఇందులో ఉన్నాయి.