18 ఏళ్లు నిండిన వారికి గుడ్‌ న్యూస్..ఆ అవకాశం మరోసారి..

Good news for those over 18..that opportunity once again ..

0
93

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలనిఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2022 విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితా పై ఏమైన అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ నేపథ్యంలో బి.ఎల్.ఓ లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్‌తో అందుబాటులో ఉంటారని ఓటరు జాబితాలో తప్పుగా ఉన్న పేరు, అడ్రస్ ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. బుధవారం కమిషనర్ స్వీప్ కమిటీ సభ్యులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పై వర్చువల్ మీటింగ్ జరిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..ఓటరు నమోదు పేర్లు, అడ్రస్ ఒక నియోజక వర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్పు కోసం సంబంధిత ఇ.అర్.ఓ లకు, గానీ www.nvsp.in, లేదా ఓటరు నమోదు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఓటరు జాబితా నుండి పేరు తొలగింపు కోసం ఫారం-7, ఓటరు జాబితాలో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గంలో అడ్రస్ మార్పుకు ఫారం-8A వినియోగంచుకోవాలన్నారు. సభ్యులు సూచించిన సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.