బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవారికి గుడ్ న్యూస్..

0
35

చాలా మంది తమకు నచ్చిన బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ వుంటారు. డబ్బులని ఫిక్సెడ్ డిపాజిట్ కూడా చేస్తూ వుంటారు. ప్రస్తుతం డబ్బులని ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలనుకునే వారికీ చక్కని శుభవార్త. ఇప్పటి నుండి ఎఫ్‌డీ చేయడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు. మరి ఆలస్యం ఎందుకు అవి ఏం లాభాలో మీరు కూడాతెలుసుకోండి.

బ్యాంకు లో డబ్బులు సురక్షితంగా ఉండడంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ వంటివి ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కల్పిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు కూడా పొందొచ్చు. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే కేంద్ర ప్రభుత్వం మీకు రూ. 5 లక్షల వరకు అందిస్తుంది. అంతేకాకుండా మీకు ఏదైనా అవసరం వచ్చిన కూడా మధ్య లో డబ్బులు తీసేయచ్చు.

మెచ్యూరిటీ కన్నా ముందే ఎఫ్‌డీ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాంకులు కొంత మేర చార్జీలు వసూలు చెయ్యడం జరుగుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా కచ్చితమైన రాబడి లభిస్తుంది. మీరు పెట్టిన డబ్బుల్లో 90 శాతం వరకు మొత్తాన్ని తిరిగి లోన్ కింద పొందొచ్చు. అదే విధంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు