తిరుమల భక్తులకు శుభవార్త..అందుబాటులోకి ఆఫ్ లైన్ టికెట్లు!

Good news for Tirumala devotees ..

0
102

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..కరోనా కారణంగా సెప్టెంబర్ 25 నుంచి ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుండి ఆన్ లైన్ ద్వారానే దర్శన టికెట్లను తీసుకునే వీలుండేది. ఇప్పుడు తిరిగి త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి ప్రకియ ప్రారంభిస్తామని టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దీనితో తిరుమల వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత కలగనుంది.

ఆన్ లైన్ లో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్న..గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులుకు దర్శన టోకెన్లు అందడం లేదన్న భావనలో టిటిడి వుందని తెలిపారు. ఎప్పటికప్పుడు తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సామాన్య భక్తులుకు సౌకర్యవంతంగా వుండేలా సర్వదర్శన టోకేన్లు జారి చెయ్యాలని భావిస్తున్నామని…కోవిడ్ తీవ్రత కారణంగా వాయుదా వేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు.

పిభ్రవరి 15వ తేదీకి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందన్న నిపుణులు సూచన మేరకు..ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15 వరకు సంబంధించిన సర్వదర్శనం టోకేన్లు మాత్రమే జారీ చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 15న పరిస్థితి అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారి చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా నిన్న శ్రీవారిని దర్శించుకున్న 24888 మంది భక్తులు కాగా… 12650 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండి ఆదాయం 2.1 కోట్లుగా నమోదు అయింది.