తిరుమల భక్తులకు శుభవార్త..ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు..వివరాలు ఇవే..

0
100

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ లో దర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి పాలక మండలి. తిరుపతిలో రోజుకి 15 వేల చోప్పున టోకేన్లు జారీ చేయాని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15, 16వ తేదిన అనేక కార్యక్రమాలకు ముహుర్తం పెట్టింది టిటిడి.

గత ఏడాది రోజుకు 2వేల చొప్పున ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లు జారీ చేసినా.. కొవిడ్‌కు తోడు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వాటిని నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు), వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 25-30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రోజు15 వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటి పోయే అవకాశం ఉంది. 16వ తేదీన శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారు.. ఒఖ రోజు ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లతో పాటు.. ఉదయాస్తమాన సేవ టికెట్ల బుకింగ్‌ డోనేషన్‌ విండోను ఈ నెల 16న అందుబాటులోకి రానుంది టీటీడీ. శుక్రవారం రోజుకు ఒక టికెట్‌కు రూ.1.50 కోట్లు, మిగిలిన రోజులకు ఒక టికెట్‌కు రూ.కోటిగా టికెట్‌ ధరను నిర్ణయించారు. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ ధఆర భారీగా ఉండటంతో సామాన్య భక్తులు బుక్ చేసుకోలేని పరిస్థితి. ఈ నిధులను తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.