తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..టికెట్లు విడుదల

0
95

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది.

నేడు సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అయితే.. కరోనా వ్యాప్తి అనంతరం దాదాపు రెండేళ్ల తరువాత ఆన్‌లైన్ , ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది.

మరోవైపు సోమవారం రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు తెలిపారు. 34,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోగా, ప్రస్తుతం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందకు దాదాపు 9 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 30 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.