రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక టికెట్‌ కొనడం ఈజీ!

Good news for train passengers..and easy to buy a ticket!

0
106

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. ఇక నుంచి రైలు టికెట్‌ కొనుక్కోవడం చాలా సులువు. ఎందుకో తెలుసా? ఈ మేరకు ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులు గంటలు తరబడి క్యూ లైన్లలో పడిగాపులు పడాల్సిన పని లేదు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి క్యూఆర్‌ కోడ్‌ను అమలులోకి తెచ్చింది దక్షిణమధ్య రైల్వే.

అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్ల(ఏటీవీఎం)లో క్యూఆర్‌(క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌తో డబ్బులు చెల్లించే సౌకర్యాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోని పేటీఎం లేక ఫ్రీఛార్జి యాప్‌ల ద్వారా ఏటీవీఎంలోని క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి డబ్బు చెల్లించి టికెట్‌ పొందవచ్చని జోన్‌ సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌  తెలిపారు.

ఏటీవీఎంల ద్వారా అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు కచ్చితంగా నగదుతో కూడిన స్మార్ట్‌ కార్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో లేదా జనరల్‌ బుకింగ్‌ కౌంటర్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స దుపాయానికి అదనంగా పేటీఎమ్, యూ పీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో స్మార్ట్‌ కార్డ్‌ అవసరం ఉండదు. జనరల్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.