బ్యాంకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త..ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7000 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మేరకు ఐబీపీఎస్ పూర్తి వివరాలను వెల్లడించింది. దీనికి సంబంధించి జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షా ఫలితాల ఆధారంగా ఉండనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు.
అర్హత: ఏదైనా డిగ్రీ పట్టా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక భాషల్లో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్ ఉండాలి. లేదా డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2021 జులై 1 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయో పరిమితి 28 ఏళ్లు. రిజర్వేషన్ కోటా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
వేతనం: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారికి ఇది రూ. 19,900- 47,920 వరకు వేతనం ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, ట్రాన్స్పోర్ట్ సహా ఇతర అలవెన్సులు మినహాయించి .. అప్పుడే ఉద్యోగంలో చేరినవారికి రూ. 29,453 వేతనం చేతికి అందుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం : 01-07-2022
దరఖాస్తులకు చివరితేదీ : 21-07-2022
ప్రి ఎంట్రెన్స్ టెస్ట్ కాల్‌లెటర్ : 2022 ఆగస్టు
ప్రి ఎంట్రెన్స్ టెస్ట్ : 2022 ఆగస్టు
ప్రిలిమ్స్ కాల్‌లెటర్ డౌన్లోడ్ : 2022 ఆగస్టు
ప్రిలిమ్స్ ఎగ్జామ్ : 2022 సెప్టెంబర్
ప్రిలిమ్స్ ఫలితాలు : 2022 సెప్టెంబర్/అక్టోబర్
మెయిన్స్ ఎగ్జామ్ : 2022 అక్టోబర్
తుది ఫలితాలు : 2023 ఏప్రిల్
ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌లో 30, న్యూమరికల్ అబిలిటీ 35, రీజనింగ్ అబిలిటీ 35 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్షకు గంట సేపు ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి కటాఫ్‌ను బట్టి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో మొత్తం 190 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. సమయం 160 నిమిషాలు ఉంటుంది. దీంట్లో కటాఫ్‌ను బట్టి నేరుగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.