నిరుద్యోగులకు శుభవార్త..ఉద్యోగాల భర్తీకి SSC నోటిఫికేషన్

0
98

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే.. పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

అర్హతల వివరాలు:

10+2 (సీనియర్ సెకండరీ) విద్యార్హతల కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి యస్సు జులై 1 నాటికి 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జులై 7

దరఖాస్తులకు ఆఖరి తేదీ: జులై 29.

ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: జులై 30

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): అక్టోబర్