తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మెదక్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 68 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల (భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత ఏంటంటే?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎం కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్ధులకు ఐదేళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.
అడ్రస్: District Medical & Health Office, Medak District, Telangana.
అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తుది మెరిట్ లిస్ట్ అక్టోబర్ 3న విడుదల అవుతుంది.
ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.