శుభవార్త..భారీగా తగ్గిన సిలిండర్ ధరలు

0
103

ఇప్పటికే రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. ఇదిలా ఉండగా..పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు కుడా నానాటికీ పెరగడమే తప్ప తగ్గడం ఎరుగని ప్రజలకు ఆయిల్ కంపెనీలు ఓ శుభవార్త చెప్పాయి. ఎల్పిజి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి.

ఎల్పిజి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 91.5 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలను కంపెనీలు సవరిస్తూ ఉండడం మనకు తెలిసిన విషయమే. తాజాగా తీసుకున్న  నిర్ణయంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 1885 రూపాయలకు చేరింది.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే..2099.5 రూపాయలు ఉండగా.. విజయవాడలో 2034 రూపాయలకు చేరింది. వైజాగ్ లో 1953 రూపాయలుగా నమోదు అయింది. 14.2 కేజీల గృహవసరాలు కోసం మాత్రం ఆయిల్ కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.