గుడ్ న్యూస్..ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల‌కు మరికొన్ని ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు

0
103

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో  ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్య‌ర్థుల ప్ర‌యాణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక రైళ్ల‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లును శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ నెల 11-తిరుపతి-సేలం, సేలం తిరుపతి (07675/07676)

ఈనెల 12- తిరుపతి-సేలం (07441)

ఈనెల 13- సేలం-తిరుపతి (07441)

ఈనెల13- షాలిమార్‌-సికింద్రాబాద్‌ (08025)

ఈనెల 14-  షాలిమార్‌-సికింద్రాబాద్‌ (08035)

ఈనెల16- సికింద్రాబాద్‌-షాలిమార్‌ (08026)

ఈనెల 17- సికింద్రాబాద్‌-షాలిమార్‌ (08036) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.