ఓ వ్యక్తి గూగుల్ వల్ల తన సంసారంలో ఇబ్బందులు వస్తున్నాయి అని అంటున్నాడు, గూగుల్ వల్ల సంసారానికి ఇబ్బంది ఏమిటి అని ఆశ్చర్యపోకండి, ఇక్కడ ఓ సంగతి ఉంది.. ఆన్‌లైన్ మ్యాపింగ్ యాప్ గూగుల్ మ్యాప్స్ పై తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాగపట్నం జిల్లా మైలదుత్తురైకి చెందిన 49 ఏళ్ల ఫ్యాన్సీ షాపు యజమాని చంద్రశేఖర్ అనే వ్యక్తి
తాను ఎప్పుడు వెళ్లని ప్రదేశాలు కూడా గూగుల్ చూపిస్తోంది అని అంటున్నాడు
యాప్‌లో కనిపించిన తప్పుడు వివరాల కారణంగా కుటుంబంలో తన భార్య అనుమానిస్తోందని
అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
గత కొద్ది నెలలుగా నా భార్య నిత్యం గూగుల్ మ్యాప్స్‌లోని యువర్ టైమ్‌లైన్ ఫీచర్‌ను తనిఖీ చేస్తోంది. ఎక్కడెక్కడ తిరిగావో చెప్పాలంటూ రాత్రి పూట నిద్రపోనివ్వడం లేదు, అని తెలిపాడు.. ఎవరు చెప్పినా ఆమె వినిపించుకోవడం లేదు, ఈ టెక్నికల్ సమస్య వల్ల నాకు ఇబ్బందిగా ఉంది అని చెబుతున్నాడు.. నా కుటుంబంలో కలహాలు రేపినందుకు గూగుల్ నుంచి పరిహారం ఇప్పించాలని కూడా కోరుతున్నాడు, మొత్తానికి దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.