గూగుల్ కి ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? అసలు ఎలా ట్రాక్ చేస్తుందంటే

గూగుల్ కి ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? అసలు ఎలా ట్రాక్ చేస్తుందంటే

0
42

మనం ఎక్కడికి అయినా వెళితే కచ్చితంగా తెలియని ప్రాంతం అయితే అక్కడ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటాం, అయితే అక్కడ రెస్టారెంట్లు హోటల్ పలు ప్రదేశాలు అన్నీ గూగుల్ మ్యాప్ లో ఈజీగా తెలుసుకుంటాం, అయితే మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా అనేది కూడా మ్యాప్ లో తెలుస్తుంది.

అంతేకాదు అక్కడ మ్యాప్స్ ఆన్ చేసిన సమయంలో ఆ రూట్ ట్రాఫిక్ ఉందని వేరే రూట్ కూడా సజెస్ట్ చేస్తుంది గూగుల్ మ్యాప్స్, ఆఫ్లైన్ ఫీచర్ కూడా ఉంది. ఇలా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా దారి చూపిస్తుంది.

గూగుల్ ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేసేందుకు రెండు పద్ధతులను ఫాలో అవుతుంది. ఇందులో ఫస్ట్ ట్రాఫిక్ ప్యాట్రన్ పద్ధతి
రెండోది సెన్సార్,

ట్రాఫిక్ ప్యాట్రన్ ద్వారా రోడ్లపై ట్రాఫిక్ ని అంచనా వేస్తాయి, ఇక్కడ నేషనల్ రోడ్లపై సెన్సార్లు ఉంటాయి కాబట్టీ ఆ డేలా ఉపయోగించుకుంటుంది.ట్రాఫిక్ ప్యాట్రన్ కోసం యూజర్స్ జీపీఎస్ డేటాను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ వాహనాలు ఎంత వేగంగా వెళుతున్నాయి, ఎంత సేపు ప్రయాణానికి సమయం పట్టింది ఇవన్నీ తీసుకుని క్రోడీకరించి ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్ ఎలా ఉంది అనేది అనలైజ్ చేస్తాయి.