కరోనా వ్యాప్తి కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభుత్వం కొత్త రూల్స్..

0
119

ఉత్త‌రాఖండ్ చార్ ధామ్ యాత్ర మే 3 తేది నుంచి ప్రారంభం కానుంది. హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే తీర్థ‌యాత్ర‌ల్లో ఇది కూడా ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్న క్రమంలో  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశ్యంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు చార్ ధామ్ యాత్ర‌కు వచ్చే భక్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరిమిత సంఖ్యలో మాత్రమే  భక్తులను అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో భద్రీనాథ్ ఆలయానికి ప్రతిరోజూ 15వేల మంది భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించింది. ఇంకా కేదారీనాథ్ ఆలయానికి 12 వేల మంది, గంగోత్రి 7 వేల మంది, యమునోత్రికి 4వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నిర్ణయం ఇలాగే 45 రోజుల పాటు వరిస్తుందని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. చాద్ ధామ్ యాత్రకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో  సమాజం మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే చార్ ధాం యాత్రకు వచ్చే భక్తులు అందరు ఉత్తరాఖండ్ టూరిజం శాఖ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.