మోగ్లీ, టార్జాన్ ఈ సినిమాలు మనం చాలా చూశాం. అయితే వారు అడవిలో ఏలా జీవిస్తారు, అసలు ఇలా ఎవరైనా ఉండగలరా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది.వియత్నాంలో ఇలాంటి ఓ వ్యక్తే తాజాగా అడవి నుంచి బయటకు వచ్చారట. ఇక ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి గురించి విని ఉండరు. ఎందుకంటే అసలు అతనికి అమ్మాయిలు ఉంటారు అనే విషయం కూడా తెలియదట.
మగవారే ఉంటారని ఇన్నేళ్లూ భావిస్తూ వచ్చాడట. అతనితో పాటు తన తండ్రి అన్న కూడా అడవిలో ఉండేవారట. ఇతను 41 ఏళ్లు ఇలా అడవిలో ఉండిపోయాడు. హో వాన్ లాంగ్ 1972 లో జరిగిన వియత్నాం యుద్ధం సమయంలో అడవుల్లోకి వెళ్లిపోయారట. ఈ యుద్ధంలో తన తల్లిని, తోబుట్టువులను కూడా పోగొట్టుకున్నాడట వాన్ లాంగ్.
అడవిలో వీరు నివాసం ఉండేవారు. దట్టమైన అడవి కావడంతో ఎవరూ అక్కడికి వచ్చేవారు కాదు, అందుకే వీరి గురించి ఎవరికి తెలియలేదు. ఇక్కడ అడవిలో ఉండేవే తింటూ అక్కడే బతికారు. కేవలం 40 ఏళ్లలో ఐదుగురిని చూశారు. వారిని చూసి వీరు పారిపోయేవారట. తేనె, పండ్లు, చిన్న చిన్న అడవి జంతువులు తింటూ అక్కడే కర్రలతో ఇళ్లు కట్టుకున్నారు. వీరిని అక్కడ ఓ ఫొటొగ్రాఫర్ ఫోటో తీసి బయటకు పరిచయం చేశాడు. ప్రభుత్వం వెంటనే వారిని ఓ గ్రామంలోకి తీసుకువచ్చింది. అప్పుడు మాత్రమే మహిళలు ఉంటారు అని వారికి తెలిసింది. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచంలో అతను జీవిస్తున్నాడు.