ఆ తెలుగు దర్శకుడితో ధనుశ్ సినిమా – టాలీవుడ్ టాక్

Hero Dhanush New Movie With Tollywood Director

0
38

తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేయడం, తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడం. ఇటు కోలీవుడ్ టాలీవుడ్ లో సినిమాలు విడుదల అవ్వడం తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో కూడా హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. ఇక తమిళ్ లో ధనుశ్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఆయనకు తెలుగులో కూడా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.

డిఫరెంట్ స్టోరీలని సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు చేస్తూ ఉంటారు ధనుశ్. తాజాగా సరికొత్త కథలని ఒకే చేస్తున్నారు.ఆయన ఒక తెలుగు సినిమాలో చేయనున్నారు అనే వార్త వైరల్ అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాను ఓ సినిమా చేయనుండటం నిజమేనని ధనుశ్ కూడా తెలియచేశారు.

అయితే తాజాగా మరో వార్త టాలీవుడ్, కోలీవుడ్ లో వినిపిస్తోంది. దర్శకుడు ప్రేమ కథతో ఆయన సినిమా చేయనున్నారు అనే టాక్ టాలీవుడ్ లో వారం రోజులుగా వినిపిస్తోంది. ఆయన ప్రేమకథలను మాత్రమే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఇక ధనుష్ తో కూడా ప్రేమ కథ తీయనున్నారని వార్త వినిపిస్తోంది.   సో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.