పాకిస్థాన్ లో సూపర్ మామిడిపండ్లు – షుగర్ ఉన్న వారు తినచ్చట రేటు ఎంతంటే

Sugar less mangos in Pakistan

0
39

పండ్లలో రారాజు మామిడి. వేసవి సీజన్ వచ్చింది అంటే ప్రతీ ఒక్కరు మామిడి పండ్లు తినాలి అని కోరికతో ఉంటారు. అయితే షుగర్ సమస్య ఉన్న వారు మామిడి తినడానికి కుదరదు. ఇందులో చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ వారు ఎవరూ మామిడి తినరు. కానీ వారు చాలా బాధపడుతూ ఉంటారు.

అయితే పాకిస్థాన్ లో ఓ రైతు చక్కెర శాతం అతి తక్కువగా ఉండే ప్రత్యేకమైన మామిడి రకాలను సాగు చేస్తున్నాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు దీని ధర కూడా చాలా తక్కువకే అందిస్తున్నారు. దీంతో చాలా దేశాలు ఇప్పుడు ఈ పండ్లు గురించి తెలుసుకుంటున్నాయి.

సోనారో, కీట్, గ్లెన్ అని ఈ షుగర్ లెస్ మామిడి పండ్లని పిలుస్తారు.
కీట్ రకంలో చక్కెరశాతం 4.7 ఉంటుంది
సోనారో రకంలో 5.6 శాతం ఉంటుంది
గ్లెన్ రకంలో 6 శాతం ఉంటుందట. ఇవి కిలో రూ.150 కే అమ్ముతున్నారు. అయితే దేశం అంతా కాదు, కేవలం పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతంలో ఓ ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో ఈ మామిడి రకాలను సాగు చేస్తున్నారు