హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు..కేవలం 25 నిమిషాల్లోనే..

0
143

హైదరాబాద్ మెట్రో ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. మెట్రో ప్రాణాన్ని నిలబెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

అవయవాల మార్పిడి ప్రక్రియ క్లిష్టతరమైనది. అందులో బ్రతికున్న గుండెను ఒకరి నుంచి మరొకరికి అమర్చడం ఒక ఎత్తు అయితే ఆ గుండెను అవసరమైన చోటకు తరలించడం మరో ఎత్తు. అంతేకాదు గుండె తరలింపు చాలా రిస్క్ తో కూడుకున్నది. కొంచెం అటు ఇటు అయిన ప్రాణం పోతుంది.

కానీ కామినేని ఆసుపత్రి వైద్యులు, హైదరాబాద్ మెట్రో సహకారంతో ఓ నిండు ప్రాణం నిలబెట్టారు. అయితే ఓ వైపు ఉప్పల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో ఫుల్ రష్ ఉంది. అయినా కానీ మెట్రో అధికారులు, వైద్యులు రిస్క్ చేసి ప్రాణాన్ని కాపాడారు. ఇక వారు చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.

గుండె తరలింపు ఇలా..

నిన్న రాత్రి మెట్రోలో నాగోల్ నుండి జూబ్లీహిల్స్ వరకు గుండెను తరలించారు. అనంతరం అక్కడి నుండి అంబులెన్స్ లో అపోలో ఆసుపత్రికి గుండెను తరలించారు. అయితే గుండె తరలింపుకు కేవలం 25 నిమిషాలు మాత్రమే సమయం పట్టింది. దీనితో ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు వైద్యులు.  కాగా గతేడాది కూడా అపోలో నుంచి గుండెను తరలించి ప్రాణాన్ని కాపాడగా ఇప్పుడు మరోసారి అలా చేసి ప్రాణాన్ని నిలబెట్టారు. ఇదంతా గ్రీన్ ఛానల్ ద్వారానే సాధ్యమైందని వారు చెప్పుకొచ్చారు.