Big news- తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు

0
77

ఇప్పటికే కురిసిన వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. నిన్న , నేడు వర్షాలు లేకపోవడంతో వరద భారీగా తగ్గింది. దీనితో  కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పగా..గోదావరి పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక తాజాగా తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపారు.