టీఎస్ ఐసెట్‌ ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సె‌లింగ్‌ వివరాలు ఇవే..

Here are the details of TS ISAT Final Phase Counseling.

0
104

తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే ఐసెట్‌ ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. తుది‌వి‌డత కౌన్సె‌లింగ్‌ షెడ్యూ‌ల్‌ను అధి‌కా‌రులు విడు‌దల చేశారు. కొత్తగా కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు స్లాట్‌ బుక్‌  చేసుకోవాలని ఐసెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు.

ఆది‌వారం నుంచి ప్రాసె‌సింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌‌బు‌కిం‌గ్‌, ఈ నెల 22న సర్టి‌ఫి‌కెట్‌ వెరి‌ఫి‌కే‌షన్‌ ఉంటుందని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చు‌కో‌వచ్చని, 26న సీట్లు కేటా‌యి‌స్తామన్నారు.

అలాగే టీఎస్ పీజీఈసెట్ -2021కు సంబంధించి సెకండ్, ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకోని అభ్య‌ర్థులు..ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ చేసి స‌ర్టిఫికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.