రిటైర్మెంట్ పై యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఏమన్నాడంటే?

What did Universe boss Chris Gayle say about retirement?

0
42

టీ20 ప్రపంచకప్​లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్​ కూడా చేరకుండానే వెనుదిరిగింది. అయితే ఈ మెగా టోర్నీలో భాగంగా స్టార్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

అలాగే యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా క్రికెట్​కు వీడ్కోలు పలికినట్లు ప్రవర్తించాడు. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ ఇస్తూ ఇప్పుడు తన మనసులోని మాటను ట్వీట్​ చేశాడు. ‘ఇప్పుడప్పుడే జట్టును విడిచివెళ్లను’ అని ట్విట్టర్ వేదికగా క్రిస్ గేల్ రాసుకొచ్చాడు.

అయితే టీ20 ప్రపంచకప్​ చివరి మ్యాచ్ అనంతరం జమైకాలో చివరి మ్యాచ్​ ఆడిన తర్వాతే రిటైర్మెంట్​పై ఆలోచిస్తానని అన్నాడు. సొంత అభిమానుల సమక్షంలోనే గుడ్​బై చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. దాదాపు 22 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన గేల్ 79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేలు ఆడాడు. మూడు ఫార్మాట్లలో పరుగుల విధ్వంసం సృష్టించాడు.