ఆధార్ లో డీటెయిల్స్ ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే?

0
47

మనకు ఉండే డాక్యుమెంట్ లలో ఆధార్ కార్డు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా స్కీమ్స్ మొదలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వరకు ఆధార్ ఎన్నో వాటికి అవసరం అవుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు పొందాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక మరి ఎలాంటి మార్పులు ఆధార్ లో చెయ్యచ్చు..ఎన్ని సార్లు చెయ్యచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..

ఆధార్​ కార్డులో మన పేరును రెండుసార్లు మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. అలానే డేట్ ఆఫ్ బర్త్ ని అయితే కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్​ చెయ్యాలి. అలాగే జెండర్ వివరాలను కూడా ఒక్కసారే మార్చాలి. ఇదిలా ఉండగా..కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వెసులుబాటును పొందొచ్చు.

ఆధార్​ సెంటర్ లో రిక్వెస్ట్ పెట్టుకుని మార్చుకోచ్చు. తర్వాత యూఐడీఏఐ సెంటర్ ​కు వెళ్ళాలి. డెమోగ్రాఫిక్​ అప్డేట్ కి అయితే రూ. 50 వసూలు చేస్తారు. బయోమెట్రిక్​ అప్డేట్ ఉంటే వంద రూపాయిలు తీసుకుంటారు. బయోమెట్రిక్​తో పాటు డెమోగ్రాఫిక్​ అప్డేట్ వున్నా వంద చెల్లించాల్సి ఉంటుంది.