భర్తని వదిలేసింది ప్రియుడితో పారిపోయింది చివరకు దారుణం జరిగింది

భర్తని వదిలేసింది ప్రియుడితో పారిపోయింది చివరకు దారుణం జరిగింది

0
88

సక్రమమైన కుటుంబాలని అక్రమ సంబంధాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి, కాంచీపురం జిల్లా ఉత్తిరమెరూర్లో దారుణం జరిగింది. కాంచీపురం జిల్లాకు చెందిన లక్ష్మి కి అదే ప్రాంతానికి చెందిన మదన్ తో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, అయితే ఆమె పద్దతి ముందు నుంచి సరిగ్గా ఉండేది కాదు, భర్త ఎంత చెప్పినా ఆమె తీరు మారలేదు, చివరకు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లక్ష్మీ అక్కడ ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.

చివరకు అతని దగ్గరకు వెళ్లిపోయింది, ముగ్గురు పిల్లలను భర్తని వదిలేసింది, అమ్మనాన్న ఎంత చెప్పినా వినలేదు, చివరకు ప్రియుడు దగ్గర మళ్లీ గర్భవతి అయింది, గత వారం పాపకి జన్మనిచ్చింది, ఈ సమయంలో పుట్టింటికి ఆమె వచ్చింది.

కాని ఆమె సోదరుడు తల్లిదండ్రి ఆమెని బయటకు పంపేశారు.. ఇంటిలోకి రావద్దు అన్నారు, భర్త కూడా అదే చెప్పాడు, దీంతో ఆమె మనస్ధాపంతో వ్యవసాయ బావిలోకి దూకింది ఈ సమయంలో రోజుల చంటిబిడ్డతో దూకేసింది, వెంటనే అక్కడ వారు ఇద్దరికి బయటకు తీశారు, ఆమె ప్రాణాలతో బయటపడింది కాని ఆ పసిపాప చనిపోయింది.