హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ – వచ్చే 72 గంటలు భారీ వర్షం – ఈ జాగ్రత్తలు తీసుకోండి

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ - వచ్చే 72 గంటలు భారీ వర్షం - ఈ జాగ్రత్తలు తీసుకోండి

0
92

ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎడతెరిపి లేని వర్షాలతో ఎవరూ బయటకు రావడం లేదు, దాదాపు నిన్నటి నుంచి కుండపోత వర్షాలుకురుస్తున్నాయి, అయితే హైదరాబాద్ ప్రజలకు మాత్రం అలర్ట్, వచ్చే మూడు రోజులు అంటే 72 గంటల పాటు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

మరో 72 గంటలపాటు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. కొన్నిచోట్ల 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షం పడొచ్చని తెలిపింది. GHMC. మాన్ సూన్ బృందాలు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు కమిషనర్. ఇక ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్త… నాళాల దగ్గరకు పిల్లలను పంపకండి, ఇక కూలిపోయేలా ఉన్నభవనాల్లో ప్రజలు ఉండవద్దు.

ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, బేగంపేట, కోఠి, మెహదీపట్నం, మణికొండ, బంజారాహిల్స్ లో భారీ వర్షం పడుతోంది. అవసరం అయితేనే బయటకు రండి ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. పిల్లలు వృద్దులు బయటకు రాకండి, ఈ సమయంలో కాచి చల్లార్చిన నీటిని తాగండి.