నేను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం ఇలా నమోదు..

0
35

తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున అకాలవర్షాలు, ఉరుములు మెరుపులు సంభవించాయి. ఈ అకాల వర్షాల కారణంగా వడ్లు కోసి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడవలసి వచ్చింది. అంతేకాకుండా వర్షాలు భారీగా కురవడంతో  మోకాళ్ల లోతు నీరు చేరి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో నేడు వర్షపాతం ఇలా నమోదు..

సికింద్రాబాద్ లోని సీతాఫల్మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు నమోదు అయ్యింది. వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్లు, అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు, గోషామహల్ బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్లు, బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది.

ఇదిలా ఉండగా..సరూర్నగర్ ఫలక్నామా లో 4.6 సెంటి మీటర్ల వర్షపాతంనమోదు కాగా..గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్లు, కాచిగూడ , సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటి మీటర్లు, అంబర్పేట్ లో 4 సెంటీమీటర్లు, అమీర్పేట్ సంతోష్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 3.6 సెంటీమీటర్లు, బేగంబజార్,హయత్ నగర్ చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..