శివరాత్రి పర్వదినాన ఆసక్తికర సన్నివేశం..చెట్టెక్కి పడగవిప్పిన నాగుపాము (వీడియో)

Interesting scene on Shivratri festival

0
116

‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమి జరగవు. మహాశివరాత్రి పర్వదినాన ఆసక్తికర సన్నివేశం కనిపించింది. స్వయంగా శివుడే తమ గ్రామానికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు ప్రజలు. పరమేశ్వరుని మెడలో బుసలు కొడుతూ ఉండే నాగన్న దర్శనమిచ్చాడని, ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దీంతో ప్రజలందరూ అక్కడికి చేరి పూజలు చేశారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. గ్రామంలోని ఓ చెట్టుపై పెద్ద నాగుపాము కనిపించింది. పడగ విప్పి సుమారు రెండు గంటల పాటు చెట్టుపైనే ఉంది. ఎంత మంది వచ్చి చూసినా ఏమాత్రం అదరకుండా, బెదరకుండా అలాగే ఉంది. నల్లెల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓ ఇంటి ప్రక్కన ఉన్న ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ మిరపకాయలను ఎండబెట్టారు కొంతమంది రైతులు. పండగ పూట సాయంత్రం వరకు ఎవరూ అటు రాలేదు. కానీ, కుక్కలు బాగా అరిచాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు కుక్కల అరుపులు విన్నాడు. ఎమైందా అని అటువైపు చూసేసరికి, చెట్టుపై పెద్ద నాగుపాము పడగ విప్పి ఉండటాన్ని గమనించాడు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో రికార్డు చేశారు కృష్ణ.

ఈ విషయం గ్రామస్థులందరికీ తెలియడంతో, అంతా అక్కడికి వచ్చి పామును చూసి భక్తిలో మునిగిపోయారు. దాదాపు రెండు గంటల పాటు పాము అక్కడే ఉండటంతో చూసేందుకు ఎగబడ్డారు నల్లెల గ్రామస్తులు. నాగుపాము దర్శనమివ్వటం శివుని మహిమ అని అంటున్నారు శైవ భక్తులు. దీంతో నాగుపాము అక్కడి నుంచి వెళ్లిపోయే దాకా, ఎవరూ ఎలాంటి హాని కలిగించకుండా చూశారు. రెండు గంటల తర్వాత పాము నెమ్మదిగా చెట్టుపై నుంచి దిగి పొదళ్లోకి వెళ్లిపోయింది. ఇంత పెద్ద పామును ఎప్పుడూ ఎక్కడా చూడలేదని చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు. ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా, పాము వెళ్లిపోవటం నిజంగా శివుని మహిమే అంటున్నారు. శివరాత్రి సమయంలో పాము దర్శనమివ్వడంతో, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.facebook.com/alltimereport/videos/1272292956596232