ఇంటికి పారిపోవడానికి ఏ గెటప్ వేశాడో తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు

ఇంటికి పారిపోవడానికి ఏ గెటప్ వేశాడో తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు

0
90

కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడ వారిని అక్కడ ఉండిపోవాలి అని ప్రభుత్వం చెప్పింది, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు, అయితే లాక్ డౌన్ వేళ కొందరు గ్రామాలకు వెళ్లిపోవాలి అని తమ సొంత ఊరికి వెళ్లిపోవాలి అని ఆలోచనలతో కార్లు బైకులతో కొందరు వెళ్లిపోయారు.

అయితే ఎక్కడికక్కడ సరిహద్దులు కూడా మూసివేయడంతో …ఇప్పుడు ఎవరూ ఎక్కడికి వెళ్లడానికి లేకుండా పోయింది.. కొందరు పాపం కాలి నడకన తమ ఊర్లకు పయణం కట్టారు.. ఇకపోతే కొందరు అతి తెలివి గల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఊరికి చేరుకోవాలని తమ మెదడుకు పని పెట్టి వ్యూహాలు రచించారు.

చివరకు పోలీసులకు అడ్డంగా దొరుకుతున్నారు.. జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఇలాగే ఓ వ్యక్తి దొరికిపోయాడు.ముగ్గురు కలిసి ఓ వ్యక్తి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు
శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ను కూడా అద్దెకు తీసుకున్నారు. ఇక పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి మరణించినట్లు నటించాడు. ఇలా చాలా చెక్ పోస్టులు దాటేశారు, చివరకు సూరన్ కోట్ దగ్గర శవం పై అనుమానంతో టెంపరేచర్ టెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో వెంటనే బండారం బయటపడింది. వారిని ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.