ఆకాశానికి ఎగబాకానున్న వంట నూనె ధరలు..కారణం ఇదే?

0
86

ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై మరింత భారం వేస్తున్నారు. మన నిత్యావసర సరుకుల్లో ముఖ్యంగా వంటనూనె ఉంటుంది. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు వ్యాపారులు పెంచడంతో ప్రజలు నానాతిప్పలు పడ్డారు. తాజాగా ఇండోనేషియా కారణంగా మరో సారి వంటనూనె ధరలు సామాన్యులకు షాక్ ఇవ్వనున్నాయి.

పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో వంటనూనెల ధరలు అధికంగా పెరగనున్నాయి. ఈనెల 28వ తేదీ నుంచి నిషేధం అమలు కానుంది. ఈ మేరకు సామాన్యులపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఇండియాకు ఇండోనేషియా 70 శాతం పామాయిల్ వస్తుండగా..30% మలేషియా నుండి వస్తుంది.

ఇండోనేషియా నిషేధం విధించడంతో భవిష్యత్తులో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకునేనే భయమేస్తుంది. ఇండోనేషియా నిర్ణయం వల్ల ధరలు అధికంగా పెరగవచ్చని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా కూడా తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం త్వరగా ఇండోనేషియా ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన కోరారు.