ఈశాన్యం మూలన ఏ వస్తువు పెట్టద్దు అంటారు కారణం ఇదే

ఈశాన్యం మూలన ఏ వస్తువు పెట్టద్దు అంటారు కారణం ఇదే

0
112

మనం ఇంటి వాస్తు గురించి మాట్లాడుకునే సమయంలో ఈశాన్యం గురించి మాట్లాడుకుంటాం, అయితే ఈశాన్యం మూలన ఏ వస్తువు పెట్టద్దు అంటారు, చిన్న ఈకలాంటి బరువు కూడా ఉండకూడదు అని చెబుతారు వాస్తు నిపుణులు.

ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు..తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, అస్సలు పెంచవద్దు..ఈశాన్యంలో, తూర్పులో ఉత్తరాన తులసికోట కట్టకూడదు…కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు.

ఇక ఈశాన్యం దగ్గర నీరు పారేలా అయినా ఉండవచ్చు, అంతేకాదు అక్కడ పెద్ద గోయి లాంటిది ఉండకూడదు, ఎత్తు అస్సలు చేయకూడదు… ఇంటికి ఈశాన్యం విషయంలో బరువు ఉన్నా సరైన వాస్తు చూడకుండా కట్టినా ఇంటి పెద్ద అలాగే ఇళ్లు ఎవరి పేరు మీద ఉంటే వారిపై ప్రభావం చూపిస్తుంది. ఇది వాస్తు విషయంలో కచ్చితంగా పాటించాల్సిన నియమం.ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది.. ఈ మూల పెరగడం ద్వారా శుభఫలితాలుంటాయి. గృహానికి ఈశాన్య భాగంలో పూజగదిని నిర్మించడం సంప్రదాయం..ఈశాన్యంలో మరుగుదొడ్ల ఏర్పాటు అసలు చేయకూడదు.