ఉద్యోగం లేదని భర్తని చంపేసిన భార్య అత్త ఇదేం దారుణం

ఉద్యోగం లేదని భర్తని చంపేసిన భార్య అత్త ఇదేం దారుణం

0
115

ఈ లాక్ డౌన్ వేళ ఆర్ధికంగా చాలా కుటుంబాలు చితికిపోయాయి అనే చెప్పాలి, వారి కుటుంబాలకు చాలా ఇబ్బంది వస్తోంది, ఆర్ధికంగా రూపాయి సంపాదనలేక అప్పులపాలవుతున్నారు, ఈ సమయంలో ఉద్యోగాలు కూడా ఉంటాయా ఉండవా అనే పరిస్దితి ఉంది, ఇక కంపెనీలో ఉద్యోగులని తగ్గించుకోవాలి అని చూస్తున్నాయి పలు కంపెనీలు.

లాక్ డౌన్ లో ఉద్యోగం దొరకదన్న భర్తను ఓ భార్య తన తల్లితో కలసి కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఇది అత్యంత దారుణం రమేష్ లాక్ డౌన్ తో ఉద్యోగం కోల్పోయాడు, దీంతో భార్య లీలతో అతనికి వివాదం వచ్చింది.

లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగం దొరకట్లేదని భర్త వాదించాడు. ఈ వాదన పెద్దది అయింది… ఈ సమయంలో లీల తన తల్లితో కలసి భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో రమేశ్ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో అతడి తల్లి, తమ్ముడు రమేశ్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు, కాని ఆ దెబ్బలకి అతను అక్కడికక్కడే మరణించాడు చికిత్స పొందుతూ.. ఇక తనను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అని భార్య కేసు పెట్టింది, ఇక భర్త హత్యతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు.