కన్నతండ్రి ఈ అమ్మాయిని ఏం చేశాడో తెలిసి షాకైన పోలీసులు

కన్నతండ్రి ఈ అమ్మాయిని ఏం చేశాడో తెలిసి షాకైన పోలీసులు

0
109

అమానుషం కన్నతండ్రే కూతురిపట్ల దారుణంగా ప్రవర్తించాడు, ఈడు వచ్చిన అమ్మాయి కదా అని ఫోన్ కొనిచ్చాడు, అయితే ఎవరితోనూ ఫోన్ మాట్లాడకూడదు అని కండిషన్ పెట్టాడు….కాని ఓరోజు ఆమె ఓ అబ్బాయితో ఫోన్ మాట్లాడింది.. ఇది చూసిన తండ్రి వెంటనే ఆమెని చితక్కొట్టాడు అడ్డమైన బూతులు తిట్టాడు.

అంతేకాదు పెద్దల ముందు ఆమెని నిలబెట్టాడు, తన కూతురు చెడిపోయింది అని అందరి ముందు తన ఇంటి పరువు తీసుకున్నాడు, అంతేకదు ఆ మైనర్ బాలికకి గుండుకొట్టించాడు, దీంతో ఈ తతంగం అంతా కొందరు వీడియో తీశారు.. దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇదిపెద్ద వైరల్ అయింది.

వెంటనే పోలీసులు అతనిని గుర్తించారు, ఇలా గుండు కొట్టించిన తండ్రిని, అలా గుండు కొట్టిన వ్యక్తిని అక్కడ పెద్దలని సుమారు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు, దీంతో ఇలాంటి దారుణాలు ఎక్కడైనా చేస్తే వారికి కఠిన శిక్షలు వేస్తాము అని తెలిపారు పోలీసులు,