కేర‌ళ‌లో ఈ ఆహారం ఎవ‌రూ కొన‌డం లేద‌ట? భారీగాపెరిగిన ధ‌ర‌లు

కేర‌ళ‌లో ఈ ఆహారం ఎవ‌రూ కొన‌డం లేద‌ట? భారీగాపెరిగిన ధ‌ర‌లు

0
95

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ కు ఎంతో మార్కెట్ పేరు ఉంటుంది, అలాగే కేర‌ళ‌లో అర‌టిపండుకి బీభ‌త్స‌మైన గిరాకీ ఉంటుంది, అంతేకాదు ఇక్క‌డ ఓణం పండుగ సంబరాల్లో బనానా చిప్స్, సర్కవరట్టి తప్పనిసరిగా ఉండవలసిందే. అయితే ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ఈ చిప్స్ అమ్మ‌కాలు లేక వ్యాపారులు ఢీలా ప‌డ్డారు.

ఓణం వచ్చిందంటే చాలు వ్యాపారులు ఆనందంగా రకరకాల రుచులతో బనానా చిప్స్ తయారు చేస్తారు.
వీటిని చాలా రుచిగా కొబ్బ‌రి నూనెతో త‌యారు చేస్తారు, అంతేకాదు ప‌లు ర‌కాల మ‌సాలా ప్లేవ‌ర్స్ యాడ్ చేస్తారు, ఈ ప్యాకింగ్స్ ప‌లు జిల్లాలు రాష్ట్రాల‌కు కూడా వెళ‌తాయి.

ఇలా చిప్స్ కిలో 380 నుంచి 450 వ‌ర‌కూ మార్కెట్లో రేటు ఉంటుంది, ఇక ఓణం వ‌స్తోంది అంటే రెండు వారాల నుంచి ఈ చిప్స సంద‌డి ఉంటుంది, ఇక ఐదు నెల‌లు షాపులు తీయ‌లేదు, మ‌రో ప‌క్క అర‌టి గెల‌లు రేట్లు భారీగా పెరిగాయి దీంతో వ్యాపారం లేక ఇబ్బంది ప‌డుతున్నారు, గ‌తంలో ఉన్న వ్యాపారంలో ఇప్పుడు 15 శాతం కూడా లేదు అంటున్నారు.. ఆగస్టు 22న ప్రారంభమయ్యాయి ఓణం పండుగ రోజులు, సెప్టెంబరు 2 వరకు జరుగుతాయి. ఇక కొనుగోళ్లు అమ్మ‌కాలు లేక చాలా వ‌ర‌కూ హొల్ సేల్ రిటైల్ షాపులు ఖాళీగా ఉన్నాయి, అక్క‌డ రేట్లు పెర‌గ‌డంతో వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌డం లేదు.