కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి…

కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి...

0
93

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది… కొడుకును కత్తితో పొడిచి చంపాడు తండ్రి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇద్దరు కుమారులు ఉన్నారు.. వీరు క్యాటరింగ్ చేసేవారు… చిన్న కుమారుడు తాగుడుకు బానిస అయ్యాడు…

రోజు తాగుతూ తల్లిదండ్రులను వేధించేవాడు… తనకు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు.. ఈక్రమంలో మరోసారి చిన్న కుమారుడు జగదీష్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు కాసేపటి తర్వాత తన అన్నతో గొడవ పడ్డాడు… ఇద్దరు అరుచుకున్న తర్వాత నిద్రపోయారు అర్థరాత్రి జగదీష్ కు మెలుకు వచ్చింది…

ఆ తర్వాత మరోసారి అన్నతో గొడవపడ్డాడు.. దీంతో తల్లి వారిని విడిపించేందుకు వెళ్లింది… ఈక్రమంలో జగదీష్ తన తల్లిని తీవ్రంగా గాయపరిచాడు ఆగ్రహించిన తండ్రి కూరగాయలు కోసే కత్తితో అతన్ని పొడిచాడు.. తీవ్ర రక్తశ్రావంతో కుప్ప కూలిపోయిన జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…