కులాంతర పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో పురుగుల మందు తాగిన ప్రేమ జంట…

కులాంతర పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో పురుగుల మందు తాగిన ప్రేమ జంట...

0
74

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… కులాంతర వివాహానికి పెద్దలు నో చెప్పడంతో ఆ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మ చేసుకుంది… ఇందుకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి… బత్తలపల్లి మండలం ఒక గ్రామానికి చెందిన యువతి ధర్మవరంలో ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోంది..

అదే కాలేజీలో చదువుతున్న యువకుడితో పరిచయం పెరిగింది.. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. అయితే వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు… వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నో చెప్పారు పెద్దలు… దీంతో కలిసి జీవించలేకపోతున్నాము కలిసి అయినా మరణిద్దామని నిర్ణయించుకున్నారు…

ఒక తోటలో ప్రేమ జంట పురుగుల మందు తాగారు.. కాసేపటి తర్వాత వీరిద్దరు అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించి అనంతపురం ఆసుపత్రికి తరలించారు… ఆసుపత్రిలో ప్రియుడు చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.. ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉంది…