తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుత సంచారం చేస్తుండగా సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను భక్తులు బంధించారు. ఆ సమయంలో అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేశారు.
చిరుతల కోసం ట్రాప్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలకు నిత్యం లక్షలాదిమంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకునే నేపథ్యంలో చిరుతల సంచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.