ఫ్లాష్- రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

Farmer killed in road accident

0
40

తెలంగాణ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిలుకూరుకి చెందిన రైతు వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా…డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ట్రాక్టర్‌లో ధాన్యాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.