LIC కన్యాదాన్ పాలసీ..రూ.150 పెట్టుబడిగా పెడితే రూ.31 లక్షలు మీ సొంతం!

0
44

ప్రతీ ఒక్కరు కూడా పిల్లల చదువు కోసం ఎంతోకొంత వెనకేయాలని అనుకుంటారు. ఆ డబ్బులు వారి చదువులు, పెళ్లి కోసం ఉపయోగిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఒక్కోసారి అవి అత్యవసర ఖర్చు కోసం పెట్టాల్సి వస్తుంది. దీనితో ఇబ్బందులు వస్తాయి. మీరు కూడా ఫ్యూచర్ లో మీ ఇంట్లో ఆడ పిల్లకి పెళ్లి చెయ్యాలా..? అయితే ఇక మీరేం కంగారు పడాల్సిన పని లేదు.ఇక ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషప్ ఆఫ్ ఇండియా ఒక పాలసీని తీసుకొచ్చింది.

అదే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ. ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషప్ ఆఫ్ ఇండియా ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వలన ఆర్ధిక ఇబ్బంది ఉండదు. మరి ఇక ఈ పాలసీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. కూతురి పెళ్లి చేయడానికి ఎటువంటి చింత లేకుండా కన్యాదానం చేసేలా కన్యాదాన్ పాలసీని రూపొందించింది ఎల్ఐసీ.

కూతురు పెళ్లి సమయానికి లక్షల రూపాయలను మనం పొందొచ్చు. అయితే దీనిలో మనం కొన్ని నెలలు పెట్టుబడి పెట్టాలి. కన్యాదాన్ పాలసీలో రోజుకి రూ.150 పెట్టుబడిగా పెడితే నెలకి రూ.4530 అవుతాయి. ఇలా మీరు 22 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్లు పూర్తయిన తర్వాత మీ చేతికి రూ.31 లక్షలు వస్తాయి.

మీరు కనుక ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ కార్డు, ఇన్‌కమ్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫోటో, మీ కూతురి బర్త్ సర్టిఫికేట్‌ అవసరం అవుతాయి. దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసును లేదా ఎల్ఐసీ ఏజెంట్‌ ద్వారా ఈ పాలసీ తీసుకోచ్చు.

18 నుంచి 50 ఏళ్ల మధ్యలో వున్నవారు దీనికి అర్హులు. మీ కూతురి వయసు కనీసం ఏడాది ఉండాలి. ఈ ప్లాన్ 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. కానీ ప్రీమియాలు 22 ఏళ్లే చెల్లించాలి. ఒకవేళ ఇన్సూర్డ్ పర్సన్ చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు వస్తాయి. యాక్సిడెంట్ అయితే కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారు.