డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే కచ్చితంగా మనం డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్లాల్సిందే. అయితే తాజాగా కొత్త నిబంధనలు వస్తున్నాయి.జులై ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి.
డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. అయితే ఇది ఎలా అనుకుంటున్నారా?
గుర్తింపు పొందిన అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో సిమ్యులేటర్, ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ తప్పనిసరి చేశారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్న వారు డ్రైవింగ్ పరీక్ష పూర్తి చేసి లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే చాలు.
వీరికి ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందే అవకాశం ఉంది.
అక్రిడేటెడ్ కేంద్రాల్లో డ్రైవింగ్ నేర్చుకున్న వారికి శిక్షణ పూర్తయిన వెంటనే లైసెన్స్ పొందే అవకాశం ఇస్తున్నారు. సో ఇక వచ్చే నెల నుంచి ఇలాంటి శిక్షణ కేంద్రాల్లో డ్రైవింగ్ నేర్చుకుంటే లైసెన్స్ ఈజీగా పొందవచ్చు.