Breaking: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద..10 గేట్లు ఎత్తివేత (వీడియో)

0
47

తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి.  ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. నాగార్జునసాగర్ గేట్లు తెరచుకోవడంతో.. ఆ ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. కృష్ణమ్మ జలసవ్వడులను కళ్లారా వీక్షించేందుకు తరలివెళ్తున్నారు.

ఇన్ ఫ్లో : 3,39,415 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 39 ,868 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం : 584.20 అడుగులు

పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.0405 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 295.1270టీఎంసీలు.

https://www.facebook.com/rajashekar.konda.351/videos/471893941063632