ఈ కరోనా సమయంలో అసలు బయటకు రావద్దు అని చెబుతున్నా కొందరు పని లేకున్నా బయటకు వస్తున్నారు…మరికొందరు ఈ సమయంలో కూడా వ్యభిచారం చేస్తూ అక్రమార్జన చేస్తున్నారు, కొందరు అమ్మాయిలని తీసుకువచ్చి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు, అయితే గ్వాలియర్ లో ఓ లాడ్జికి కుర్రాళ్లు వచ్చి పోతుంటే… అక్కడి ఓ పాన్ షాపు దగ్గర కిళ్లి కట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తికి డౌట్ వచ్చింది. అక్కడకు చాలా మంది కుర్రాళ్లు వచ్చి వెళుతున్నారు.
ఆ లాడ్జికి ఎందుకు అంతమంది వస్తున్నారు అని పాన్ షాప్ అతన్ని అడిగితే… ఇక రోజు ఇదే పని రోజు 24 గంటలు అబ్బాయిలు వస్తూనే ఉంటారు అని చెప్పాడు, దీంతో అనుమానం వచ్చి అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు
పోలీసులు రైడింగ్ చేశారు.
5గురు అమ్మాయిలు దొరికారు. వీరంతా ఢిల్లీ, కోల్కతాకు చెందిన వారు…తమని ఇద్దరు కేటుగాళ్లు ఈ వృత్తిలోకి దించారని అమ్మాయిలు చెప్పారు…. ఇక కరోనా వస్తుంది అని భయంగా ఉన్నా ఈ ఇద్దరు కేటుగాళ్లు కరోనా వచ్చినా డబ్బే ముఖ్యం మీరు ఇది చేయాల్సిందే అని బెదిరించారట… పోలీసులు వారిని పట్టుకునేందుకు వెతుకుతున్నారు.