నిమ్మరసం అతిగా తాగుతున్నారా కచ్చితంగా ఇది తెలుసుకోండి

నిమ్మరసం అతిగా తాగుతున్నారా కచ్చితంగా ఇది తెలుసుకోండి

0
32

చాలా మంది ఉదయం సాయంత్రం రోజుకి రెండు మూడుసార్లు నిమ్మరసం తాగుతూ ఉంటారు… ముఖ్యంగా సి విటమిన్ వస్తుంది అలాగే ఇమ్యునిటీ పెరుగుతుంది అని ఆలోచిస్తారు.. అయితే కాలాలతో సంబంధం లేదు ఎప్పుడూ ఇలా నిమ్మరసం తాగుతూనే ఉంటారు, అయితే జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అధిక బరువు తగ్గిస్తుంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టి తాగుతారు.

 

బాగుంది కదా అని ఎక్కువ నిమ్మరసం తాగకూడదు. రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే. ఇది వైద్యులు చెబుతున్న మాట, ఇలా ఎక్కువ నిమ్మరసం తాగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా చూద్దాం.

దంతాలు నాశనం అవుతాయి ..అందుకే రోజుకి ఒకటి కంటే ఎక్కువ నిమ్మరసం వద్దు.లెమన్ వాటర్లో ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. అది దంతాలపై ఎనామెల్ను దెబ్బతీస్తుంది.

 

దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంటాయి దంతాలు గరుకుగా ఉంటే ఈ సమస్య ఉన్నట్లే…నిమ్మరసం ఎక్కువైతే అల్సర్లు, ACDT సమస్యలు, కడుపునొప్పి వస్తాయి. GERD అనే ప్రాబ్లం తలెత్తుతుంది..పొట్టలో వేడి, వికారం, వామ్టింగ్స్ వస్తున్నట్లు అవుతుంది. ఇక నిమ్మరసం ఎక్కువ తీసుకుంటే మూత్రాశయం ఎక్కువ వర్క్ చేయాలి అందుకే ఆ సమస్యలు వస్తాయి.. నిమ్మరసం ఎక్కువగా తాగితే కూడా చిగుళ్లు పాడైపోతాయి. నాలుకపై పగుళ్లు వస్తాయి అందుకే అతిగా కాకుండా రోజుకి లేదా రెండు రోజులకి ఓ నిమ్మకాయ రసం తీసుకోండి.